Fact Check: గోవాలో పడవ ప్రమాదం 78 మంది మృతి అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్... ఇందులో నిజమెంత?

Fact Check: గోవాలో పడవ మునిగిందని, అత్యాశతో టూరిస్ట్ షిప్ కంపెనీ వాళ్ళు ఎక్కువ మందిని పడవలోకి ఎక్కించడంతో అది మధ్యలోనే మునిగిపోయిందని చెబుతూ వీడియో వైరల్ అవుతోంది.ఈ అంశంపై గోవా పోలీసులు వివరణ ఇచ్చారు.

Update: 2024-10-06 03:31 GMT

Fact Check: గోవాలో పడవ ప్రమాదం 78 మంది మృతి అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్... ఇందులో నిజమెంత?

Fact Check: గోవాలో పడవ మునిగిందని, అత్యాశతో టూరిస్ట్ షిప్ కంపెనీ వాళ్ళు ఎక్కువ మందిని పడవలోకి ఎక్కించడంతో అది మధ్యలోనే మునిగిపోయిందని చెబుతూ వీడియో వైరల్ అవుతోంది.ఈ అంశంపై గోవా పోలీసులు వివరణ ఇచ్చారు.

గోవాలో వందలాది మంది ప్రయాణికులతో కూడిన పడవ మునిగిపోయిందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. గోవాలో ఓవర్ లోడ్ చేసిన స్టీమర్ బోల్తా పడిందని ఎక్స్ లో వీడియో చేశారు. ఈ ప్రమాదంలో 23 మృతదేహాలను వెలికితీసి 40 మందిని రక్షించామని, ఇంకా 64 మంది తప్పిపోయారని రాసుకొచ్చారు. అయితే ఆ వార్త ఫేక్ అని తప్పుదారి పట్టించేదని తేలింది. ఈ వీడియోపై గోవా పోలీసులు స్పందించారు. వైరల్ క్లిప్ ను గోవాలో జరిగిన పడవ ప్రమాదానికి తప్పుగా ఆపాదిస్తున్నారని చెప్పారు. గోవా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడిందని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఒకటి. ఇది పూర్తి అవాస్తవం. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలోని గోమాలో జరిగింది..అని గోవా పోలీసులు ట్వీట్ చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయడం మానుకోవాలని ప్రజలను కోరారు.

అసలు జరిగింది ఇదీ:

ఆఫ్రికా దేశం కాంగోలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 78 మంది మృతి చెందారు. కాంగోలోని కివు సరస్సులో పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 78 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. బోటు బోల్తా పడే ముందు అందులో 278 మంది ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ భయానక వీడియో కూడా బయటకు వచ్చింది.

మొత్తం మృతదేహాలు లభ్యం కాకపోవడంతో మృతుల సంఖ్య కచ్చితంగా తెలియాలంటే కనీసం మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. 58 మందిని రక్షించినట్లు దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురిసిన్ తెలిపారు. పడవ తీరానికి కేవలం 100 మీటర్లు (328 అడుగులు) దూరంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అవుతోంది. అయితే ఈ పడవ ప్రమాదం గోవాలో జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.  ఇది పూర్తిగా ఫేక్. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలోని గోమాలో జరిగింది. దయాచేసిన ఇలాంటి వార్తలు షేర్ చేయడం మానుకోండి అంటూ గోవా పోలీసులు శనివారం అధికారిక ట్వీట్ చేశారు.


Tags:    

Similar News