కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న దుబ్బాక ఉపఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయించడంతో పాటు మరికొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర బౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొన్నది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి బూత్ నెంబర్ 50లో ఈవీఎంలు మొరాయించాయి. మిరుదొడ్డి మండలం కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.