Corona fear in people: రాకండోయ్ .. మా ఇంటికి! అంటున్న ప్రజలు!! (వీడియో)

Corona fear in people: బంధు మిత్రులు ఇంటికి వస్తున్నారంటే ఆ సందడే వేరు. ఇది ఒకప్పటి మాట. ఎవరూ రాకపోతేనే మేలు ఇప్పటి మాట కరోనా తెచ్చిన పెను మార్పు ఇది.

Update: 2020-07-11 15:15 GMT

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎప్పుడో ఓ పాట రాశారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని అదే నిజం అవుతోంది. ఉమ్మడి కుటుంబాలు పెరుగుతున్న నగరీకరణతో చిన్నాభిన్నం చేసుకున్న ప్రజలు.. ఇప్పుడు కరోనా దెబ్బతో కనీస సంబంధ బాంధవ్యాలకూ చెక్ పెట్టేసుకుంటున్నారు. ఇది తప్పని సరి పరిస్థితి. రారండోయ్ మాయింటికి అని ఆప్యాయంగా పిలిచి సాదరంగా విందు ఇచ్చే రోజులు కావివి. ఎవరు ఇంటికి వస్తున్నా వామ్మో అని ఉలిక్కిపడే దుర్దినాలు దాపురించాయి. ఐసోలేషన్ అంటే కరోనా బారిన పడడంతో వైద్యులు సూచించినదే కాదు. ఎవరు ఇంటికి వచ్చినా ఇబ్బందులు తప్పవనే భయంతో తలుపులు మూసుకుని ఇంట్లోనే కూచోవడం కూడా అన్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు చాలా మంది మనసుల్లో.. కొందరు బయటకే అంటున్నారు రాకండోయ్ మా ఇంటికి అని..HMTV ప్రత్యెక కథనం..చూడండి!

Full View


Tags:    

Similar News