Jonnalagadda Jyothi: ఆడపిల్లా...? అగ్గిపుల్లా...?
Jonnalagadda Jyothi: ఆడపిల్లా...? అగ్గిపుల్లా...?
Jonnalagadda Jyothi: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఇదివరకటి రోజుల్లో పెళ్లి అనేసరికి అమ్మాయిలో సిగ్గు, బిడియం కలయబోసిన అందం ఉండేది. పీటలమీద కూర్చుని తాళి కట్టేదాకా ఆ సిగ్గులు వెళ్లబోస్తూ అటు చూసేవాళ్ళకి కనువిందుగా, ఇటు పిల్లికూతరులో కూడా చక్కని ఆడతనం కనిపించేవి. మరి ఇప్పుడో...? పెళ్లి నిశ్చయమవడం పక్కనపెట్టండి. తాంబూలాలుదాకా వెళ్లారు.. భేష్...పెళ్లి సమయం కూడా వచ్చేసింది...ఇంకా శభాష్...మరి పెళ్లి జరుగుతుందా..? అనుమానమే. ఎందుకంటే అదివరకు అమ్మాయికి ఎటువంటి సంబంధం ఎవరితో ఉందొ తెలియదు. చివరికి తల్లితండ్రులకి కూడా...! పెళ్లిపీటలమీద లేచిపోయి ఇంకొకరిని వివాహం చేసుకోవడం. చాలా విడ్డూరంగా లేదు. నేటి సమాజం ఎటు పోతోందో ఎవరికీ తెలియదు. వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు నివ్వెరబోయి అలా నుంచుండిపోవడమే. అంతకంటే చేసేదేముంది కనక. ఇలా ఉన్నాయి ఈరోజుల్లో పెళ్లిళ్లు. సమాజం బాగుపడాలంటే తల్లితండ్రులు పెళ్ళికి ముందుగా ఒక పురాణ ప్రవచనం ఆ శ్రీరాముని చరితం ఒక్కసారి చెప్పుకుంటే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం.