తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే కానుకలు సిద్ధమయ్యాయి. సిరిసిల్ల నేతన్నల చేతుల్లో రూపొందిన ఈ చీరలు ఇప్పటి నుంచే జిల్లాలకు చేరుకుంటున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఈసారి ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.