ఇలాంటి అత్తగార్లుంటే ఏ కోడలైన విడికాపురం పెడుతుంది..!
Marriage: ఇక అసలు విషయానికి వస్తే వివాహం చేసేదే ఎందుకండీ..?
Marriage: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహం చేసేదే ఎందుకండీ..? కామాన్ని ధర్మబద్ధం చెయ్యడం కోసం అలాగే సత్సంతానాన్ని పొందడం కోసం. కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారే...? సరిగ్గా కొత్త జంటని కాపురం చేసుకోనివ్వరు సరికదా.. తన కొడుకు ఎక్కడ తన కోడలికి లొంగిపోతాడో...? ఎక్కడ తన అమ్మని పట్టించుకోడో అని తమ దుర్బుద్ధిని వెళ్లగక్కుతారు.
కానీ ఆ జంటకి ఏం తెలుస్తుందండీ...? ఈ విషయం. అమ్మమీద ప్రేమ కొడుక్కి ఎప్పటికి తగ్గదు. అలా అని భార్యని వేరుగా చూడలేడు.. కానీ ఇద్దరినీ సమర్ధించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. కొన్ని సందర్భాలలో తల్లులు చేసే పనులవల్ల కోడళ్ళు కూడా విడికాపురాలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇది అవసరమా...? పుట్టిన దగ్గిర నుంచి తల్లి ఎంతో అల్లారుముద్దుగా పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది...
అలాంటిది పెళ్ళైన తరువాత ఇలాంటి బుద్ధులు తల్లుల్లో ఎందుకు ఏర్పడుతున్నాయి.? అవును లెండి. ఒక రకంగా సీరియల్స్ ప్రభావం కూడా ఉందేమో...? సమయం సందర్భం లేకుండా తాళిని ఎగతాళి చేస్తూ ప్రదోషవేళల్లో విసిరి కొడుతుంటే పిల్లలు ఏమని అర్ధం చేసుకుంటారు. ముందుగా ఈ సీరియల్స్ ని Ban చేస్తే ఎమన్నా మార్పు కనపడుతుందేమో..? వేచి చూడాలి. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.