ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రోజు ఏ మలుపు తిరుగుతాయో ఊహించేలోపే మార్పులు జరిగిపోతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లోనే తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కతుంటే.. రాజమండ్రిలోని తెలుగు తమ్ముళ్ల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. గ్రూపు తగాదాలతో వర్గపోరును కొందరు నేతలు పెంచి పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చియ్యచౌదరికీ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రాజకీయ పరిణామాలు రాజమండ్రిలో కొనసాగుతున్నాయిప్పుడు. రాజమండ్రి దేశంలో అంతలా రాజకీయ వర్గపోరు కొనసాగడానికి కారణాలేమిటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..