Election Commission: తెలంగాణలో కొత్త పార్టీకి షాకిచ్చిన ఎన్నికల కమిషన్
* ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున...ప్రజా ప్రస్థానం పాదయాత్ర తాత్కాలిక వాయిదా
Election Commission: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తెలంగాణలో కొత్త పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. పార్టీ ఏర్పాటు తర్వాత ప్రజల్లోకి వెళ్లిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వెంటనే ఆగి పోవాల్సివచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.
కోడ్ ముగిసిన వెంటనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. పాదయాత్ర మొదలు పెట్టిన రోజు 400 రోజుల పాటు పాదయత్ర చేస్తానని చేవెళ్ల నుంచి మొదలు పెట్టి మళ్లీ చేవెళ్ల వస్తానని శపథం చేసారు షర్మిల. కాని ఈ 21 రోజుల్లో సాగిన యాత్రలో ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను మాత్రమే సందర్శించారు.
ఇలా సడన్‌గా పాదయాత్రకు బ్రేక్ వేస్తే మళ్లీ మొదటి నుంచి పార్టీ యాక్టివిటి మొదలు పెట్టాలి కాబట్టి రైతుల కోసం 72 గంటల దీక్షను కూడా చెపడతానని చెప్పారు షర్మిల. 9 గంటలు కూడా పూర్తి కాకుండానే పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఇక తప్పని సరి పరిస్థితుల్లో ఇంటి దగ్గర దీక్ష చేస్తానని చెప్పినా పోలిసులు అనుమతి ఇవ్వలేదు. ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న దీక్షలో కూర్చుందామని షర్మిల భావించారు. దానికి కూడా పోలిసుల నుంచి అనుమతి రాలేదు. దీంతో ఈ నెల రోజులు పార్టీని ప్రజల్లో ఎలా ఉంచాలో తెలియక తికమక పడుతున్నారట షర్మిల.