లోటస్‌పాండ్‌కు వైఎస్ విజయమ్మ.. రాజకీయ వర్గాల్లో చర్చ
* రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిన విజయమ్మ రాక * షర్మిల కొత్త పార్టీపై చర్చించేందుకే వస్తున్నారని జోరుగా చర్చ * తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన షర్మిల కొత్త పార్టీ వ్యవహారం
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న షర్మిల నల్గొండ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కాసేపట్లో లోటస్‌పాండ్‌కు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే.. విజయమ్మ కొత్త పార్టీ వ్యవహారలపై చర్చించేందుకు వస్తున్నారా లేక బ్రదర్ అనిల్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారా అన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.