YSRTP: వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై మరో ముందడుగు
YSRTP: వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఆమె పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
YSRTP: వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఆమె పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వైఎస్ షర్మిల పార్టీ పేరుతోపాటు, పార్టీ ఏర్పాటు తేదీపై ఆమె ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ రాజగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు.
తెలంగాణలో పార్టీ పెడతానని, రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల ప్రకటన చేశారు. దాంతో ఆమె పెట్టబోయే పార్టీ పేరు, పార్టీ విధి విధానాలపై అనేక ఊహాగానాలు వచ్చాయి. షర్మిల పార్టీ పేరు వైఎస్‌ఆర్ టీపీ అని జూలై 8న ఆమె ప్రకటిస్తారని ప్రచారం జోరుగా జరిగింది. చివరకు ఆప్రచారమే నిజమైంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా తమ పార్టీ పేరును షర్మిల రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఆపార్టీ చైర్మన్ వాడుక రాజగోపాల్ స్పష్టం చేశారు.
జూలై 8న వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ ఆవిర్భావం ఉంటుందని రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్‌ను చేసుకున్నామని చెప్పిన ఆయన అభ్యంతరాలు తెలపడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమయం కూడా ముగిసిందన్నారు. వైఎస్ విజయమ్మ ఆశీస్సులతో తెలంగాణలో వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనను గడపగడపకు అందించడమే ధ్యేయంగా షర్మిల పార్టీ పెడుతున్నట్లు రాజగోపాల్ వెల్లడించారు.