YS Sharmila: అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల
YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు.
YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఇవాళ జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో తమ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తుందని తెలిపారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. పాలేరుతో పాటు మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని.. పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్లు వస్తున్నాయని. రెండో స్థానంలో పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. విజయమ్మ, అనిల్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్లు వచ్చాయని తెలిపారు. అవసరమైతే విజయమ్మ పోటీ చేస్తారని షర్మిల చెప్పారు.
మొత్తం 119 స్థానాల్లోనూ YSRTP పోటీ చేస్తుందని షర్మిల తెలిపారు. ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని తాము అనుకున్నామని.. ఓట్లు చీలిస్తే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని అనుకున్నామని చెప్పారు. అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపామని.. పొత్తు కోసం నాలుగు నెలలు ఎదురు చూశామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాము ఓంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో YSRTP గెలుపు ఖాయమని.. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకువస్తామని షర్మిల చెప్పారు.