YS Sharmila Deeksha: దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల

YS Sharmila Deeksha: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.

Update: 2021-04-15 07:35 GMT

YS Sharmila

YS Sharmila Deeksha: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిరాహార దీక్ష చేసేందుకు కూర్చొన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభిచారు. దీక్ష శిబిరానికి చేరుకున్న షర్మిల వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ముందుగా మూడు రోజులు దీక్ష నిర్వహించాలని భావించారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆమె ఎప్ప‌టివ‌ర‌కు దీక్ష చేస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. ఖమ్మంలో సంకల్ప సభ పేరుతో జరిగిన మొదటి సభ‌లోనే షర్మిల ప్రభుత్వానికి అల్టిమేటం జారి చేశారు. 

నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు దృష్టిలో ఉండటంలో పోలీసులు అనుమతిని కుదించారు. అయితే.. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News