Telangana: పార్టీ స్థాపనపై స్పీడ్ పెంచిన వైఎస్ షర్మిల

Telangana: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు.

Update: 2021-03-25 10:00 GMT

Telangana: పార్టీ స్థాపనపై స్పీడ్ పెంచిన వైఎస్ షర్మిల

Telangana: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. అందుకోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ 33 జిల్లాల ముఖ్యనేతలతో లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరితోనూ పోత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఏప్రిల్ 9న ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఏప్రిల్ 9న మొదటి అడుగువేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందుకోసం ఖమ్మం జిల్లాలో లక్ష మందితో సభ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. టీఆర్ఎస్ చెప్తేనో బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని వైఎస్ షర్మిల నేతలతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. 

Tags:    

Similar News