తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది: వైఎస్ షర్మిల

తెలంగాణలో వైస్ షర్మిల పార్టీ‌పై రాజకీయ వర్గల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది.

Update: 2021-02-09 09:55 GMT

తెలంగాణలో వైస్ షర్మిల పార్టీ‌పై రాజకీయ వర్గల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది.ఈ నేపథ్యంలో ఇవాళ షర్మిల లోటస్ పాండ్‌లో వైఎస్ అభిమానులు, విధేయులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో తన పని తాను చేసుకుంటున్నారు. నేను తెలంగాణకు కమిటెడ్‌గా పని చేయాలని అనుకుంటున్నా'నని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోందన్న షర్మిల వ్యాఖ్యనించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక వైసీపీ బాధ్యతలు చెపడతారా? అని అడిగిన ప్రశ్నలకు కొత్త పార్టీ దిశగా ఆలోచన్ చేస్తున్నామంటు సంకేతాలు ఇచ్చారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై పరోక్ష విమర్శలు సంధించారు షర్మిల.. ''కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా.? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా..? ఆరోగ్య శ్రీ అందరికీ అందుతోందా..? పక్కా ఇళ్లు అందరికీ వచ్చాయా..? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లయ్యింది..?'' అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ ఏపార్టీలో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని, తమ పార్టీ తరపున తెలంగాణ సీఎం అభ్యర్థిగా షర్మిలానే ఉంటారని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తులు వస్తున్నాయి.

షర్మిలా పార్టీ పెడతారంటూ వస్తున్నఊహాగానాలు రావడంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు. తెలంగాణ లో మరోపార్టీకి అవకాశం లేదంటూ.. టీఆర్ఎస్ గాలికీ అన్ని పార్టీలు కొట్టుపోతాయని విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News