YSR Fans: యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుంది- షర్మిల
YSR Fans: పార్టీ నిర్మాణంపై వైఎస్ షర్మిల స్పీడప్ చేసింది. దాంతో వరుసగా భేటీలు నిర్వహిస్తుంది.
YSR Fans: పార్టీ నిర్మాణంపై వైఎస్ షర్మిల స్పీడప్ చేసింది. దాంతో వరుసగా భేటీలు నిర్వహిస్తుంది. మొన్న వరంగల్ వైఎస్ అభిమానులతో భేటీ అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లా వైఎస్‌ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందన్నారు. యావత్ తెలంగాణకు కరీంనగర్ అద్దం పడుతుందని సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం సింగరేణి మనకు తలమానికం అన్నారు. వైఎస్‌ఆర్‌కు కరీంనగర్‌కు విడదీయరాని బంధం ఉందని షర్మిల గుర్తు చేశారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేర్ కట్టించిన ఘనత వైఎస్‌కు చెందుతుందన్నారు.