Youth Collecting Funds For Friend Treatment: ఆదర్శంగా నిలిచిన యువకులు

Update: 2020-07-27 07:03 GMT

Youth Collecting Funds For Friend Treatment: దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ అనే పాటను అందరూ వినే వుంటారు. ఈ పాటలో స్నేహం గురించి ఎంతో అద్భుతంగా రాసారు. నిజానికి పాటలో ఉన్నట్టుగానే స్నేహం అంటే అది ఒక విడదీయని బంధం. ఒక స్నేహితులు బాధపడుతుంటే ఓదారుస్తారు, అదే కష్టంలో ఉంటే నేనున్నానని వెన్నుతడతారు. ఆపదలో ఆదుకుంటారు, ఆకలితో ఉన్నప్పుడు ఆకలిని తీరుస్తారు అదే స్నేహమంటే. ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని ఆదుకుని ప్రాణాలను కాపాడుతారు. ఇదే స్నేహం అంటే..అని నిరూపించాడు ఓ యువకుడు. తన చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొవడంతో తోటి స్నేహితులు ఆదుకోవాలని సంకల్పించారు. అందుకోసం ఓ వాట్సాప్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసి అందులో విరాళాలు సేకరించి స్నేహితుడిని ఆదుకున్నారు. ఇలాంటి మంచి మనసు కలిగిన స్నేహితుల పూర్తివివరాల్లోకెళితే మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన కోయ లక్ష్మణ్ (23) అనే యువకునికి ఈ నెల 16వ తేదీన జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా అతని కుటుంబ సభ్యులు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బాధితుని స్నేహితులు పిన్నం వెంకటేశ్, వోలపు రత్నకుమార్, పర్వతి తిరుపతి, ఎలుక మహేందర్‌లు వారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలనుకున్నారు. దాని కోసం లక్ష్మణ్‌ సహాయ నిధి పేరుతో అతని స్నేహితులు 130 మందితో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశారు. దాంతో ఆ గ్రూపులో ఉన్న సభ్యులు, విషయం తెలుసుకున్న మరికొంత మంది వారికి తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. దీంతో మొత్తంగా రూ.96,042 లను సమకూర్చి ఆస్పత్రిలో బిల్లు మొత్తం కట్టేశారు.



  

Tags:    

Similar News