యాదగిరిగుట్టపై వాహన పార్కింగ్ బాదుడు.. గంటకు రూ.500 వసూలు.. దాటితే అదనంగా మరో వంద
Yadagirigutta: యాదగిరిగుట్టలో అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం...
Yadagirigutta: నేటి నుండి యాదగిరిగుట్టపై వాహన పార్కింగ్ బాదుడు అమల్లోకి వచ్చింది. మొదటి గంటకు 500 రూపాయలు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. గంట దాటితే అదనంగా మరో వంద వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. కేవలం సామాన్య భక్తులకు మాత్రమే ఈ బాదుడు. ఇక స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను కొండపైకి అనుమతి లేదు. కాగా.. గతంలో బైక్‌కు 10 రూపాయలు, కారుకు 30 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేసేవారు.