హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై నిబంధనలు బేఖాతరు

Update: 2020-11-18 08:53 GMT

హైదరాబాద్‌ కేబుల్‌ బ్రిడ్జిపై పోలీసులు ఎంత నిఘా ఉంచినప్పటికీ పరిస్థితి మాత్రం మారడంలేదు. బ్రిడ్జిపై ఎలాంటి వాహనాలు నిలపరాదన్న పోలీసు అధికారుల నిబంధనలు పాటించడంలేదు. రోడ్డుపై అడ్డంగా వాహనాలు ఆపి మరీ నగర వాసులు ఫొటోలకు ఫోజులిస్తున్నారు. సెల్ఫీ మోజులో పడి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. రోడ్డు మధ్యలో నిలబడి ఫొటోలు దిగడం, లేదా వేరేవారికి ఫొటోలు తీయడం లాంటివి చేస్తున్నారు. దీంతో మిగిలిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా.. అలాంటి ఘటనే వెలుగుచూసింది. కేబుల్‌ బ్రిడ్జిపై వాహనాన్ని పక్కకు ఆపిన ఓ యువతి మరో యువకుడికి ఫొటోలు తీస్తూ అడ్డంగా బుక్కయింది. వాహనాల రద్దీ ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్డు మధ్యలోకి వెళ్లి ఫొటోలు తీస్తోంది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ అక్కడకు చేరుకొని బైక్‌ నెంబర్‌ను ఫొటో తీసి చలాన్‌ విధించాడు. 

Tags:    

Similar News