రసవత్తరంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ రాజకీయం.. కేసీఆర్ జూబ్లీహిల్స్ అభ్యర్థిని మార్చుతారా?
Jubilee Hills Constituency: జూబ్లీహిల్స్ బరిలో ఉంటానని తేల్చి చెప్పిన విష్ణువర్ధన్ రెడ్డి
Jubilee Hills Constituency: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది. అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక చేసామని చెబుతోది. రెండో జాబితా ప్రకటన తరువాత అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి. సీటు ఆశించి దక్కని ఆశావాహులు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్,ఖైరతాబాద్ అభ్యర్థిగా పీజేఆర్ కుమార్తె పి.విజయారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక్కడ ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో లెక్కలు మారుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఖైరతాబాద్ అభ్యర్థిగా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి అవకాశం కల్పించారు. పీజేఆర్ కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం తర్జన భర్జన పడింది. జూబ్లీహిల్స్ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి దివంగత నేత కుటుంబం నుంచి టికెట్ ఆశించారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై స్ర్కీనింగ్ కమిటీ పలుమార్లు చర్చించింది. చివరకు విజయారెడ్డి వైపే మొగ్గు చూపించింది.
ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డితోపాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి టికెట్ ఆశిస్తూ వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలగజేసుకొని రోహిణ్‌రెడ్డిని అంబర్‌పేట నుంచి పోటీ చేసేలా ఒప్పించారు. దీంతో విజయారెడ్డికి మార్గం సుగమమం అయింది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో అసమ్మతికి కూడా చెక్ పెట్టినట్టు అయింది. జూబ్లీహిల్స్ నుంచి పి.విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు పరిశీలనకు వచ్చింది. మొదట విష్ణుకే టికెట్ వస్తుందని అందరూ భావించారు. పార్టీ విషయంలో ఆయన నిర్లక్ష్య ధోరణిని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ ఎలా ఇస్తారనే వాదనలు వెల్లువెత్తాయి. దీంతో విష్ణుకు చెక్ పెడుతూ అజారుద్దీన్ పేరును ఖరారు చేశారు. విష్ణుకు చెందిన ఓ సన్నిహిత వర్గం అజారుద్దీన్ వైపు మొగ్గు చూపించింది.
విష్ణు నాయకత్వం వద్దంటూ అధిష్ఠానాన్ని కలిసింది. అవన్నీ పరిగణలోకి తీసుకోవడంతోపాటు నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం అజారుద్దీన్ పేరు ప్రకటించింది. దీంతో విష్ణు కాంగ్రెస్ వీడారు. కేసీఆర్ సమక్షంలో విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అంటే జూబ్లీహిల్స్ టికెట్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారా...? లేక స్వతంత్ర అభ్యర్దిగా అయినా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతారా అనేది తేలాల్సి ఉంది.
అయితే ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్ది బరిలో ఉన్నారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో తలెత్తే అసమ్మతి విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. క్రికెట్ జీవితంలో వివాదాలు ఎదుర్కొన్న అజారుద్దీన్ తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్‌లో ఏ రకంగా సక్సెస్ అవుతారనేదీ చూడాల్సిందే.