దుబ్బాకలో దుమ్మురేపేదెవరు..?

Update: 2020-11-10 02:32 GMT

రాష్ట్రంలో అందరి చూపు దుబ్బాక వైపే.. అధికార పార్టీ గెలుస్తుందా. కమలం పార్టీ విజేయకేతనం ఎగురవేస్తుందా.. అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల టెక్షన్‌ కు గురవుతున్నాయి. ఫలితం ఎలా ఉండబోతుందో అని ఉత్కంఠకు గురువుతున్నాయి. అసలు దుబ్బాక రాజకీయ చరిత్ర ఏంటి.? గతంలో ఇక్కడ ఏయే పార్టీలు గద్దెనెక్కాయి. ఎవరెవరు గెలిచారు.

దుబ్బాక అనగానే ఒకప్పుడు టీడీపీ గుర్తుకువచ్చేది. దుబ్బాక టీడీపీకి కంచుకోటగా ఉండేది. మాజీ మంత్రి, దివంగతనేత చెరుకు ముత్యంరెడ్డి, 1989లో తొలిసారిగా టీడీపీ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లోనూ ముత్యంరెడ్డిదే తిరుగులేని విజయం. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత దుబ్బాకలో గులాబీ పార్టీ జోరు మొదలైంది. ఇక్కడి ప్రజలు తెలంగాణ సెంటిమెంట్‌కు పట్టం కడుతూ వచ్చారు.

తెలంగాణ వచ్చాక కూడా దుబ్బాక నియోజకంవర్గంలో కారు హవా కొనసాగింది. 2014, 2018 ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సోలిపేట రామలింగారెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే ఆయన ఆకస్మాత్తుగా చనిపోవడంతో ఇప్పుడు ఉపఎన్నిక జరిగింది. తెలంగాణ రాక ముందు టీడీపీకి, తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్‌కు దుబ్బాక కంచికోటగా ఉండేది. మరీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్తగా కాషాయం పార్టీ దూసుకువచ్చింది. అధికార పార్టీకి సవాల్‌గా నిలుస్తోంది. నువ్వా నేనా అన్నట్లు ఎలక్షన్ జరగడంతో దుబ్బాక రాజకీయ రణక్షేత్రానికి వేదికగా మారింది.

2018 సార్వత్రిక ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గంలో 14 మంది బరిలో ఉన్నారు. కానీ ఈ ఉపఎన్నికలో ఏకంగా 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కానీ అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరీ దుబ్బాకలో కమలం వికసిస్తుందా గులాబీ వికసిస్తుందా చూడాలి. 

Tags:    

Similar News