Rains in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు!

Update: 2020-09-19 06:24 GMT

రెండురాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఆగకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా వుంది అంటే.జో

జోగులాంబగద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఎక్కడి కక్కడ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో పుల్లూరు కలుగొట్ల మధ్య రాకపోకలు నిలిచాయి. అమరవాయి - మానవపాడు మధ్య పెద్దవాగు పొంగి పొర్లుకుండటంతో రాకపోకలు స్తంభించాయి. బొంకూర్ గ్రామం దగ్గర అంతర రాష్ట్ర రహదారిపై పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

నందిన్నెనిర్మాణ బ్రిడ్జి ప్రక్కన ఉన్న తాత్కాలిక మట్టిరోడ్డు భారీ వర్షానికి మూడవసారి కోతకు గురైంది. దీంతో గద్వాల- రాయచూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాకుండా నందిన్నె బ్రిడ్జి సమీపంలో తాత్కాలిక రోడ్డు కోతకు గురికావడంతో లారీ నీటిలో కూరుకుపోయింది.

గద్వాల జిల్లా కేంద్రంలోని గంజిపేట ప్రిన్స్ లోడ్జ్ ఎదురుగా ఉన్నా గూడిసెల మధ్యన ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్నాయి. కొన్ని గుడిసెలు నేలమట్టం అయ్యాయి. దీంతో ప్రజలు పిల్లలతో రోడ్ల పైకీ వచ్చరు.

భారీగాకురిసిన వర్షానికి మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్లో ఊర చెరువు అలుగు ఉధృతంగా పారుతుంంది. దీంతో సుమారు 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది.

అటువికారాబాద్ జిల్లా పరిస్థితి చూసుకుంటే భారీ వర్షాలకు వాగులు, వంకలు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్, బుద్దారం వాగులు పొంగి పొర్లడం తో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు చేరడంతో తాండూరు కాగ్నానది ఉదృతంగా ప్రవహిస్తుంది.

ఇకకడప జిల్లా విషయానికొస్తే శనివారం రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కమలాపురం మండలం గొల్లపల్లి వద్ద వరద నీటి తాకిడికి ఆర్ధరాత్రి బ్రిడ్జి కుప్పకూలింది. అంతే కాక కడప - తాడిపత్రి రహదారిలో రాకపోకలు నిలిచాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో రోడ్లన్ని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎర్రగుంట్ల నుంచి వేంపల్లెకు వెళ్లే రహదారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వంకలు. కోడూరు వరకు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభిచిపోయాయి. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు... వంకలు పొంగిపొర్లతున్నాయి. సిద్దవటం మండలంలోను ఇదే పరిస్థితి.

Tags:    

Similar News