Weather Update: తెలంగాణకు మరో ఆరు రోజులు భారీ వర్షాల ముప్పు

Weather Update: భాగ్యనగరానికి మరో ఉపద్రవం రాబోతోంది మరో 48 గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2021-09-04 15:15 GMT

Weather Update: తెలంగాణకు మరో ఆరు రోజులు భారీ వర్షాల ముప్పు

Weather Update: భాగ్యనగరానికి మరో ఉపద్రవం రాబోతోంది మరో 48 గంటల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. దాంతో చాలా ప్రాంతాల్లో రోడ్లను వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, మలక్ పేట ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దాంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక పక్క వర్షం మరో పక్కన ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షం కురిసే చాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, హైటెక్ సిటి, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, అంబర్ పేటల్లో భారీ వర్షం పడింది. ముసారాంబాగ్ దగ్గర వరద నీటిలో బ్రిడ్జి మునిగింది. దాంతో అంబర్ పేట, ముసారాంబాగ్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గత రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇప్పటివరకు నమోదు అయిన వర్షపాతం సంతోష్‌నగర్‌లో 8.8 సెంటిమీటర్లు, మలక్‌పేట్ ‌లో 8.2సెంటీమీటర్ల ఐఎస్ సదన్ 5సెం.మీ, కాచిగూడ, ఎల్బీనగర్‌ లో 4.5. రెయిన్ బజార్‌లో 4.3, సరూర్ నగర్ లో 4.1., లింగోజిగూడలో 3.6., ఉప్పల్, రామంతపూర్‌లో 3.2. డబీర్‌పురాలో 2.9సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. 

Tags:    

Similar News