Rain Alert: వారం రోజులు భారీ వర్షాలు..నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత
Rain Alert:గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ అంచనాల ప్రకారం వర్షం కురుస్తోంది. తెలంగాణ, ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో నిన్న భారీ వర్షం పడింది. మరి నేడు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Rain Alert: భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం మేరకు అరేబియా సముద్రం నుంచి కర్నాటక, దక్షిణంవైపున ఒక ద్రోణి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 21వ తేదీ నుంచి వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం పెద్దగా వర్షలు పడే అవకాశం లేదు.
సాయంత్రం 3 తర్వాత హైదరాబాద్, కోస్తాంధ్రలో చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. క్రమంగా అక్కడ వాన పెరుగుతుంది. రాత్రం 7గంటకు తగ్గుతుంది. రాత్రి10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయి. 3 గంటల పాటు కుండపోత వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం, సాయంత్రం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం నుంచి ఎక్కువ ప్రదేశాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే పగటివేళ పెద్దగా వర్షం పడే అవకాశం లేదని శాటిలైట్ అంచనాలు చెబుతున్నాయి.