తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలే..
తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత వార రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు నిన్న కురిసిన వర్షాలతో ఉపశమనం లభిస్తుంది.
తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత వార రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు నిన్న కురిసిన వర్షాలతో ఉపశమనం లభిస్తుంది. హైదరాబాద్‌లో ఆదివారం క్యుములో నింబస్ మేఘాల ఏర్పడడం వల్ల భారీ వర్షం కురిసింది. అందువల్ల ఆదివారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఇవాళ ఉదయం కూడా వాన పడింది. ఇవాళ, రేపు భారీ వర్షం పడుతుందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.
రెండు రోజులు వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి మురికి నీరు చేరింది. తెలంగాణలో చాలా జిల్లాల్లో వానలు కురిశాయి. GHMC అధికారులు నిన్నటి నుంచి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. అక్కడక్కడా కూలిన చెట్లు, రాలిన కొమ్మల్ని తొలగించింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అందువల్ల వచ్చే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కేరళను నైరుతి తాకిన సమయంలో ఇలా ముందుగానే వర్షాలు కురుస్తుండటం మంచిదే అంటున్నారు. అటు ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసుగుతుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకూ తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళపై ఉపరితల ద్రోణి ఉంది. దీంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి