Uttam Kumar Reddy: పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృష్టి సారించాం
Uttam Kumar Reddy: గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకే రూ.18వేల కోట్లు చెల్లించాం
Uttam Kumar Reddy: తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు 28 వేల కోట్లు కేటాయిస్తే.. గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకే 18వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు 11 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో పెట్టాలని ఆర్ధిక శాఖను కోరుతున్నామన్నారు. సీఎం హామీ మేరకు 2025 డిసెంబర్ 25కల్లా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఈనెల 20న ndsa కమిటీతో సమావేశం అవుతామని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు మంత్రి ఉత్తమ్.