Mohan Das: యాంటీ ర్యాగింగ్ రూల్స్ ప్రకారం.. మానసికంగా వేధించడం ర్యాగింగ్‌గానే భావిస్తున్నాం

Mohan Das: ప్రీతిని, సైఫ్ ర్యాగింగ్ చేశాడని నిర్ధారించాం

Update: 2023-03-01 13:30 GMT

Mohan Das: యాంటీ ర్యాగింగ్ రూల్స్ ప్రకారం.. మానసికంగా వేధించడం ర్యాగింగ్‌గానే భావిస్తున్నాం

Mohan Das: కాకతీయ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై సుధీర్ఘంగా చర్చించి నిజానిజాలేంటో తేల్చింది. కమిటీ ముందు ఎంజీఎం సూపరిడెంట్, ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, అనస్తీషియా హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి, ఆర్డీవో, వరంగల్ ఏసీపీతో పాటు ఇతర సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రీతి విషయంలో అసలేం జరిగిందని నాగార్జున రెడ్డిని అడిగి పూర్తి వివరాలను ర్యాగింగ్ కమిటీ సేకరించింది. సుధీర్ఘ సమావేశం తర్వాత మెడికో ప్రీతిపై... సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ నిర్థారించింది. ఫిజికల్‌గా కాకుండా మానసికంగా వేధింపులకు గురిచేయడం కూడా ర్యాగింగ్ కిందికే వస్తుందని కమిటీ తేల్చింది. చివరగా సైఫ్ ర్యాగింగ్ చేసినట్టు కమిటీ ఏకగ్రీవంగా నిర్థారించిందని కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ వెల్లడించారు. ఈ కమిటీ తేల్చిన విషయాలన్నింటినీ నివేదిక రూపంలో యూజీసీకి పంపుతామన్నారు. యూజీసీ నిర్ణయాల ప్రకారం సైఫ్‌పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

Tags:    

Similar News