Hyderabad: డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ బాజాలు.. డీజే డ్యాన్స్‌ల నడుమ గణేష్ శోభాయాత్ర
Hyderabad: హైదరాబాద్ నగరంలో కోలాహలంగా వినాయక నిమజ్జనం
Hyderabad: హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. దాదాపు 11 రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జనం చేసేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ఎంజే మార్కెట్లో డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో దద్దరిల్లుతుండగా.. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, నడుమ శోభాయాత్ర జరుగుతోంది.ఈ శో్భయాత్రలో కర్ర సాము ఆకర్షణగా నిలిచింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందంగా గణపతి నిమజ్జనానికి బారులు తీరారు.