సమీపిస్తున్న వినాయ చవితి వేడుకలు.. నిమజ్జనం ఎక్కడ..?

Vinayaka Chaviti 2022: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు కోర్టు బ్రేక్‌...

Update: 2022-05-21 06:26 GMT

సమీపిస్తున్న వినాయ చవితి వేడుకలు.. నిమజ్జనం ఎక్కడ..?

Vinayaka Chaviti 2022: వినాయక చవితి ఉత్సవాలంటే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంబురంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ వచ్చిందంటే.. హైదరాబాద్‌ నగరంలో సందడే వేరు. చవితి వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఆగస్టు 31న ప్రత్యేక పూజలతో వినాయకులను గ్రేటర్‌లో ప్రతిష్ఠించనున్నారు. గతంలో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలను నిర్వహించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈసారి నిమజ్జనానికి ఎక్కడ ఏర్పాటు చేస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఎక్కడ ఏర్పాటు చేస్తోందనేది చర్చనీయాంశంగా మారింది.

వినాయక చవితి పర్వదినానికి మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. చవితి తరువాత నిర్వహించే నిమజ్జనాన్ని ఈసారి హుస్సేన్ సాగర్‌లో జరపొద్దని హైకోర్ట్ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిలీవింగ్‌తో గతేడాది నిమజ్జనాన్ని పూర్తి చేశారు. హుస్సేన్‌ సాగర్‌కు ప్రత్యామ్నయంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. మట్టి విగ్రహాలైనా సరే.. హుస్సేన్‌ సాగర్‌లో మాత్రం వద్దని కోర్టు స్పష్టంగా తెలిపింది.. కానీ ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ ఎలాంటి కార్యచరణను మొదలు పెట్టలేదు. ఇదే సమయంలో గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్‌లోనే చేస్తామని గణేష్ మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.

బైఈ నేపథ్యంలో నిమజ్జనం ఏర్పాట్లను చూడాల్సిందిగా జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. చెరువుల నిమజ్జనాల కోసం బేబీ పాండ్స్‌ వినియోగిస్తామని జీహెచ్‌ఎం గతేడాది తెలిపింది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో వినాయకచవితి రానుంది. మరోవైపు పీఓపీ విగ్రహాలు తయారుచేయకుండా తయారీదారులకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇంత తక్కువ సమయంలో నిమజ్జనం కోసం కొత్త చెరువులు ఏర్పాటు చేయడం కుదరదు జీహెచ్‌ఎంసీ అదికారులు తేల్చి చెబుతున్నారు. అయితే పీవోపీ విగ్రహాల తయారీని ఆపేసినా.. మట్టితో తయారయ్యే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నా... బేబీ పాండ్స్‌ మాత్రం సరిపోవు.. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ స్థానికంగానే జీహెచ్‌ఎంసీ డివిజన్లు, కాలనీల వారీగా కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News