Vijayashanti: గడీలో దొరకు కరోనా రోగుల ఆర్త‌నాదాలు వినిపించలేదా?

Vijaya Shanti: కేసీఆర్ స‌ర్కార్ పై మ‌రోసారి నిప్పులు చెరిగారు బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి.

Update: 2021-05-18 11:02 GMT

విజ‌య శాంతి ఫైల్ ఫోటో

Vijayashanti: కేసీఆర్ స‌ర్కార్ పై మ‌రోసారి నిప్పులు చెరిగారు బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని విమ‌ర్శించారు. ఫీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదా అని ప్ర‌శ్నించారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణలేదని సీఎం ఈ విష‌యాన్ని ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లించేద‌ని విజ‌య‌శాంతి అన్నారు.

కేసీఆర్ వైఖ‌రి వ‌ల్ల‌ ఆయుష్మాన్ భారత్ అమలు ప‌థ‌కంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందని విజ‌య‌శాంతి చెప్పారు. తన బంధువుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని నిల‌దీశారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ను అమలు చేయాల‌న్నారు. అలాగే ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాల‌ని ఎంత మంది మొత్తుకుంటున్నా కేసీఆర్ విన‌డం లేద‌ని.. కేసీఆర్ వైఖ‌రికి నిర‌స‌న‌గా.. బుధ‌వారం " గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష" చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ దీక్ష‌ను విజ‌యవంతం చేయాల‌ని విజ‌య‌శాంతి కోరారు.

Tags:    

Similar News