Karimnagar: ముఖ్యమంత్రి సహాయ నిధికి వేములవాడ ప్రెస్ క్లబ్ 25 వేల విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి అరికట్టడానికి, ప్రభుత్వం లాక్ డౌన్ చేపట్టింది.

Update: 2020-04-15 12:26 GMT

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి అరికట్టడానికి, ప్రభుత్వం లాక్ డౌన్ చేపట్టింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రజలను చైతన్య పరిచేందుకు జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో మమేకమై జర్నలిస్టులు మేము సైతం, తమ వంతు బాధ్యతగా పత్రికల ద్వారా, టీవీల ద్వారా కథనాలు ప్రచురిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అద్యక్షులు లాయక్ పాషా , ఉపాధ్యక్షులు ఎం.డి రఫీ, ప్రధాన కార్యదర్శి బాస్కర్ రెడ్డి లు బుధవారం జిల్లా ఆదనపు కలెక్టర్ అంజయ్య కు చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ప్రెస్ క్లబ్ సభ్యులను ను అభినందించారు. బుధవారం వేములవాడ ప్రెస్ క్లబ్ టి యుడబ్ల్యూ జెహెచ్ 143 సభ్యులు సైతం కరోనా వైరస్ తరిమేందుకు తమ వంతు సహాయంగా ముందుకు రావడం, 25 వేల రూపాయల విరాళాన్ని అందజేయడం హర్షించదగ్గ విషయమని అదనపు కలెక్టర్ అన్నారు. కష్టకాలంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో డాక్టర్లు, పోలీసులు రెవెన్యూ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ మామిళ్ల దశరథం, వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి పాశం, ఉపాధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రెస్ క్లబ్ సభ్యులు రమణతో పాటు తదితరులు పాల్గొన్నారు

Tags:    

Similar News