వేదాద్రి ఘటనలో మృతులకు ఎక్స్‌గ్రేషియా..సీఎం కేసీఆర్ ప్రకటన
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద బుధవారం ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదం లో చనిపోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని వెల్లడించారు. ఎపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కు గురువారం ఉదయం సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడకు సూచించారు.
కాగా కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. ఆలయం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.