VC Sajjanar: కాసులకు కక్కుర్తిపడి బెట్టింగు యాప్ మాయలో పడకండి..
VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. కాసులకు కక్కర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయొద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్ లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారు. బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై యువత అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం..?. సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైదని యువత గుర్తించాలన్నారు. స్వార్థ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకింద నీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండండని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కోరారు.