Dil Raju about KTR: కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ మాములుగా లేదుగా

Update: 2024-12-31 15:45 GMT

Dil Raju comments on KTR's statement about Allu Arjun issue: సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో వివాదం సెటిల్ చేసుకుని సైలెంట్ అయ్యారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్టు వివాదం అటెన్షన్ డైవర్ట్ చెయ్యడానికే సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారని కేటీఆర్ అనడం తప్పు అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి సినిమా వాళ్లను లాగొద్దని ఆయన కేటీఆర్ కు హితవు పలికారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల కోసం సినీ పరిశ్రమను వాడుకోవద్దన్నారు.

సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి భేటీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ సమావేశం జరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తెలుగు సినిమా కీలక పాత్ర పోషించేలా చూడాలని కోరారు. తెలుగు సినిమాను, హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. అంతేకాని అనవసర వివాదాల్లోకి సినీ ప్రముఖులను లాగొద్దని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం కేటీఆర్ చేసిన విమర్శలకు తాజాగా దిల్ రాజు ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 

Tags:    

Similar News