Rythu Bharosa Scheme: రైతు భరోసా పథకం ఎవరికి వర్తిస్తుంది, దరఖాస్తులు ఎప్పటి నుండి?
Rythu Bharosa Scheme: రైతు భరోసా పథకం ఎవరికి వర్తిస్తుందంటే... దరఖాస్తులు ఎప్పటి నుండి?
Rythu Bharosa scheme guidelines, application dates: రైతు భరోసా పథకం విధివిధానాలపై చర్చించేందుకు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏయే రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే, దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం ఎల్లుండి జరిగే క్యాబినెట్ భేటీలో తీసుకుంటారు.
తాజాగా క్యాబినెట్ సబ్-కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరాల్సి ఉంది. మరోవైపు జనవరి 4 శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అప్లికేషన్ తీసుకునేది ఎప్పుడంటే..
రైతు భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్తగా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 4న కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే దీనిపై ఒక ప్రకటన చేయనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల్లో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని సమాచారం.