Money: వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి రూ. 45వేలు జమ
Money: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త ఏడాది వస్తూనే శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం రిసోర్స్ పర్సన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి డబ్బులు లభించనున్నాయి. కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పట్ణణ మహిళా నిర్వహణలో మెప్మా పరిధిలో రిసోర్స్ పర్సన్లు పనిచేస్తుంటారు. వీళ్లు పలు రకాల పనులు చక్కబెడుతుంటారు. అర్హులకు స్కీములు చేరువయ్యేలా చూస్తారు. అయితే వీళ్లకు మాత్రం గత కొన్ని నెలలుగా జీతాలు సరిగ్గా లభించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా పురపాలక సంచాలకులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై పురపాలక సంస్థలే వీళ్లకు జీతాలు అందించాలని స్పష్టం చేసింది.
సాధారణంగా అయితే మెప్మానే వీళ్లకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే మెప్మా వద్ద నిధులు లేకపోవడం వల్ల రిసోర్స్ పర్సన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిసోర్స్ పర్సన్లకు నెలకు రూ. 6,500 జీతాలు లభిస్తుంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రిసోర్స్ వీళ్ల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. సంక్రాంతి పండగ ముందే ఇది సానుకూల నిర్ణయం అనే చెప్పుకోవచ్చు.
కాగా రిసోర్స్ పర్సన్లకు 7నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం నెలకు రూ. 6,500 చొప్పున చూసినా కూడా మొత్తంగా వీళ్లకు ఒకేసారి రూ. 45వేలు అకౌంట్లో పడే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. దీని వల్ల సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఆర్ పీలకు భారీ ఊరట లభించనుంది.