Scheme: రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం..ఒక్కొక్కరికి రూ. 60వేలు..పూర్తి వివరాలివే
Indiramma Housing Scheme: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ..పేద ప్రజల కోసం అనేక స్కీములను ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగానే .ప్రజల కోసం నూతన సంవత్సరం వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చుకుంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పేదలకు సొంతంటికలను సహకారం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్త సంవత్సరం వేళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు సహకారం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త సంవత్సరం కానుకగా ఫ్రీ ఇసుక అందించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇసుకను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాలు ధరలు డిమాండ్ వంటి అంశాలపై కొన్ని ప్రత్యేక బృందాలు అధ్యయనం జరుపుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి .
ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో టన్ను ఇసుక ధర 1400 నుంచి 1700 వందలకు లభ్యం అవుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 2,200 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు దొరుకుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 40 టన్నుల ఇసుక అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్ను సగటు ధర 1500రూపాయలతో గణిస్తే..ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా 60వేల రూపాయల వరకు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది.
ప్రస్తుతం భద్రాది కొత్తగూడం, ములుగు, కాలేశ్వరం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. ప్రభుత్వం అదనంగా ఇసుక నిల్వలు కల్పించేందుకు కొత్త ర్యాంపులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటి సంఖ్యను మరింత పెంచి పేదలకు ఫ్రీగా పంపిణీ చేసే ప్లాన్ చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
ఈ ఉచిత ఇసుకతోపాటు తక్కువ ధరకే ఐరన్, సిమెంట్ వంటివి ఇందిరమ్మ స్కీం కింద లబ్ధిదారులకు అందిస్తే ఇంటి నిర్మాణం వేగవంతం అవుతుందని సర్కార్ భావిస్తుందట. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహకారం చేయడంలో పేదలకు మేలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.