Formula E Race Case: తీర్పు వచ్చేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు
Telangana High Court: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Telangana High Court: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు మంగళవారం సాయంత్రం కోర్టు తెలిపింది.
ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్దార్ద్ ధవే వాదించారు. ఈ నెల 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తొలుత ఈ నెల 31 వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.డిసెంబర్ 31న నిర్వహించిన విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ పిటిషన్ పై తీర్పు ఇచ్చేవరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
నిబంధనలకు విరుద్దంగా ఎఫ్ఈఓకు రూ. 55 కోట్లు చెల్లించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏసీబీ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. అవినీతి జరిగిందని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన కోర్టుకు విన్నవించారు. అసలు ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఈఓ సంస్థ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారా అని కోర్టు ప్రశ్నించింది.
ఇందులో కేటీఆర్ లబ్ది పొందినట్టు ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది చెప్పారు.409 సెక్షన్ వర్తించదని, అవినీతి జరిగిందనేందుకు ఆధారాలు కూడా లేవని వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాలేదని కూడా గుర్తు చేశారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని కోర్టుకు తెలిపారు.
సెక్షన్ 409 కేటీఆర్ కు వర్తిస్తుందని వాదించారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని వాదించారు. మరో వైపు ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకుంటే తప్పేలా అవుతుందని కేటీఆర్ న్యాయవాది వాదించారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు..కానీ, లాభాలు ఎలా వస్తాయో చెప్పలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కౌంటర్ ఇచ్చారు.