KTR: నన్ను జైలుకు పంపాలని రేవంత్ కుట్ర
తనను ఏదో ఒక రకంగా జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు.
తనను ఏదో ఒక రకంగా జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఈ నెల 7న ఈడీ ( ED)విచారణకు హాజరు కావాలా వద్దా అనే విషయాన్ని తమ న్యాయవాదులు నిర్ణయిస్తారని ఆయన అన్నారు.
ఫార్ములా -ఈ కారు కేసులో (Formula E Car race Case) పసలేదన్నారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుతో తనను అరెస్టు చేసేందుకు ఆరో ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు.
ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు.. కేసులో పసలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)లో రూ. 12 వేల కోట్ల స్కాం జరగబోతోందని ఆయన ఆరోపించారు. పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి కాంగ్రెస్ నేతలు దిల్లీకి పంపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.