Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నమోదైన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

Update: 2025-01-01 05:09 GMT

 Hyderabad: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు కొత్త ఏడాదికి ఆనందంగా స్వాగతం పలికారు. డీజేలు, డ్యాన్సులు, ఇతర వినోదాలతో ఉత్సాహంలో మునిగిపోయారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను ఆస్వాదించారు. అయితే పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినా కూడా కొందరు మందుబాబులు మాత్రం రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డారు.

హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236కేసులు నమోదు అయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192 కేసులు, వెస్ట్ జోన్ లో 179, సౌత్ వెస్ట్ జోన్ లో 179 , నార్త్ జోన్ లో 177 సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

ఇక రోడ్లపై పోలీసులు తనిఖీలను చూసి కొందరు మందుబాబులు తమ బైక్స్ వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు.

Tags:    

Similar News