Vaccine: మరో 13 కేటగిరీల వారికి స్పెషల్‌ డ్రైవ్‌లో టీకాలు

Vaccine: రేపటి నుంచి టీకా వేయనున్న వైద్యాధికారులు * 13 కేటగిరీల్లో పనిచేస్తున్న 3లక్షల మందికి టీకా

Update: 2021-06-13 04:22 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Vaccine: కరోనా స్ప్రెడ్డర్లకు ముందుగా టీకా వేస్తోంది రాష్ట్రం ప్రభుత్వం. అందులో భాగంగా మరో 13 కేటగిరీల వారికి స్పెషల్‌ డ్రైవ్‌లో టీకాలు వేయాలని తెలంగాణ వైద్యశాఖ నిర్ణయించింది. ఆ జాబితాలో పూజారులు, ఇమాంలు, పాస్టర్లు కూడా ఉన్నారు. వీరికి రేపటి నుంచి టీకా వేయనున్నారు. ఈ మేరకు జిల్లాల యంత్రాంగాలు కీలకమైన ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి, టీకాలు పంపిణీ చేయాలని ఆదేశించింది.

ఇప్పటికే 24 కేటగిరిల్లో పనిచేస్తున్న వారి కోసం స్పెషల్‌ టీంలు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. ఇప్పుడు మరో 13 కేటగిరీల్లో పని చేస్తున్న 3లక్షల మందికి టీకాలు వేయనున్నట్లు హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాస‌రావు తెలిపారు. ఎక్సైజ్, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ సిబ్బంది, పంచాయతీరాజ్ ప్రతినిధులు, విద్యుత్‌ సిబ్బంది, స్టాంపులు రిజస్ట్రేషన్లు, బ్యాంకులు, ఆర్‌ఎంపీలు, ఇంజినీరింగ్, ఐకేపీ, పోస్టల్, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల సిబ్బంది, డయాలసిస్ - తల సేమియా కేంద్రాల సిబ్బందికి టీకాలు వేయనున్నారు.

Tags:    

Similar News