Telangana: రెండు రోజులు టీకాలు ఇవ్వడం లేదు- వైద్య ఆరోగ్య శాఖ
Telangana: మూడు నెలల క్రితం వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తర్వాత తెలంగాణలో రోజూ లక్షా 50 వేల మందికి టీకా వేస్తున్నారు
Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రోజురోజుకు కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొరత ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు టీకాలు ఇవ్వడంలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు రెండో డోస్ కోసం అవస్థలు పడుతున్నారు. మొదటిసారి ఏ కంపెనీ టీకా తీసుకున్నారో రెండోసారి అదే కంపెనీ టీకా తీసుకోవాలి. తమదైన టీకా కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు.
మూడు నెలల క్రితం వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తర్వాత తెలంగాణలో రోజూ లక్షా 50 వేల మందికి టీకా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీకాల కొరత వేధిస్తుంది. టీకాలు పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టీకాయే శ్రీరామ రక్ష అని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రానికి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి టీకాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. టీకాలు వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తామంటున్నారు.