ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ లు నిండుకుండల మారిపోయాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకి నీల్లు విడుదల చేస్తున్నారు అదికారులు. జిల్లాలో ఉన్న మానేరు ప్రాజెక్టులు, కాళేశ్వరం బ్యారేజ్ లు అన్ని ఇప్పుడు నీటి వరదతో ఉధృతిగా మారిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంగనర్ లో అన్ని కీలకమైన ప్రాజెక్టులు వరద తాకిడిని ఎదుర్కుంటున్నాయి. ఎస్సారెస్సీ నుండి వస్తున్న నీటి ప్రవాహం ఒకవైపు స్దానిక వాగుల నుండి వస్తున్న వరద ఒకవైపు ఇలా జిల్లాలోని అన్ని జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, బ్యారేజ్ ల గేట్లు ఎత్తి అధికారులు దిగువకి నీటిని వదిలారు.
ఉమ్మడి జిల్లాలో మానేరు నది పై ఉన్న మూడు ప్రాజెక్టులకు భారీ వరద వస్తోంది. సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకుతుంది. 2 టిఎంసిల కెపాసిటి ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ నీళ్లు దిగువకి వెళ్తున్నాయి. ఇక దిగువనే ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్ నుండి 30 వేల క్యూసెక్కుల నీళ్లని దిగువగి వదులుతున్నారు. మిడ్ మానేరు మొత్తం సామర్ద్యం 26 టిఎంసిలు. ప్రస్తుతం 25 టింఎసీలు ఉండగా, ప్రాజెక్టు కి ఇంకా వరద కొనసాగుతుంది. ఇక మిడ్ మానేరుకి దిగువన ఉన్న లోయర్ మానేరు ప్రాజెక్టుకి ఇటు మానేరు నది అటు స్దానిక మోయతుమ్మెద వాగు నుండి వరద కొనాసాగుతుంది. దీంతో గేట్లు వదిలి దిగువకి నీళ్లు వదిలారు అదికారులు. లోయర్ మనేరు పూర్తి సామర్ద్యం 24 టింఎసిలు. ప్రస్తుతం 23.5 టింఎసీల నీళ్లు ఉండగా వరద కొనసాగుతుంది. లోయర్ మానేరుకి మోయతుమ్మెద, మానేరు వాగుల నుండి 55వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో ఉండగా అదే స్దాయిలో గేట్లు వదిలి కాకతీయ కేనాల్ ద్వారా కూడా నీళ్లు దిగువకి పంపిస్తున్నారు అదికారులు.
ఇక జిల్లాలో ఉన్న కాళేశ్వరం బ్యారేజి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ నుండి వస్తన్న వరదతో పాటుగా స్దానిక వాగుల నుండి వస్తున్న వరదతో గోదావరి తీవ్ర రూపం దాల్చింది. ఎల్లంపల్లి డ్యాం లో ఉన్న 20 గేట్లని ఎత్తి దిగువకు 15 లక్షల 50 వేల క్యూసెక్స్ నీళ్లు వదులుతున్నారు అదికారులు. ఇక్కడ ఇన్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఇక దిగువన ఉన్న పార్వతీ బ్యారేజ్ నుంచి 60 గేట్లని వదిలి దిగువకి నీళ్లు వదులుతున్నారు. ఎస్సారెస్పీ నుండి చాలా ఏళ్ల తరువాత గేట్లను ఎత్తి దిగువకి నీళ్లు వదిలారు అదికారులు.
అటు మానేరు నుండి ఇటు గోదావరి నుండి వస్తన్న భారీ నీటి వరదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని జలాశయాల్లో నీల్లు పొంగిపోర్లుతున్నాయి. జిల్లాలో ఉన్న చెరువులు, కాలువలు సైతం ఫుల్ ట్యాంక్ కెపాసిటితో ఉన్నాయి. మొత్తం గోదావరి తీరమంతా ఇప్పుడు ఉద్రతమైన నీటి ప్రవాహాంతో కనిస్తుంది. గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు హైఅలెర్ట్ గా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. మరోవైపు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదలడంతో పర్యటకుల సందడి కూడా భారీగా పెరిగింది.