Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: అధికార పార్టీ నేతలకే నిధులిస్తామనడం ప్రజాస్వామ్యం కాదు
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే నిధులిస్తామనేలా వ్యవహరించడం ప్రజాస్వా్మ్యం కాదన్న బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.