HMDA Mokila Plots: మోకిల ప్లాట్లకు భారీ డిమాండ్.. ప్రీ బిడ్ మీటింగ్ కు అనూహ్య స్పందన.. ఆగస్టు 23 నుంచి మోకిలలో ఫేజ్2 ప్లాట్ల వేలం

HMDA Mokila Plots: ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించనున్న మోకిల ప్లాట్లు

Update: 2023-08-18 07:14 GMT

HMDA Mokila Plots: మోకిల ప్లాట్లకు భారీ డిమాండ్.. ప్రీ బిడ్ మీటింగ్ కు అనూహ్య స్పందన.. ఆగస్టు 23 నుంచి మోకిలలో ఫేజ్2 ప్లాట్ల వేలం

HMDA Mokila Plots: మోకిల ప్లాట్ల అమ్మకానికి సంబంధించి నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి అనూహ్యమైన స్పందన వచ్చినట్టు అధికారులు తెలిపారు. 165 ఎకరాల్లో 1,321 ప్లాట్ల లే అవుట్‌ను అభివృద్ధి చేసిన హెచ్ఎండిఏ రెండో దశలో 300 ప్లాట్లను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించనుంది. శంకర్ పల్లి మండలం, మోకిల ప్రాంతం‌లో హెచ్ఎండిఏ లేఅవుట్ ని అభివృద్ధిచేసింది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను సిద్ధం చేసింది.

అయితే మోకిల ప్లాట్లకు మొదటి ఫేజ్ లో మంచి డిమాండ్ పలికిన నేపథ్యంలో రెండో దశలో 300 ప్లాట్లను ఈ నెల 23 నుంచి 29 వరకు ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయిస్తోంది. దీనికి సంబంధించి గురువారం మోకిల లేఅవుట్ ప్రాంతంలో హెచ్ఎండిఏ నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అనూహ్య స్పందన వచ్చినట్టు హెచ్ఎండీఏ వర్గాలు తెలిపాయి.

హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్.కె.మీరా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, సైట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సాయిరాం,శంకర్ పల్లి మండలం తహశీల్దార్ సురేంద్రలతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రీబిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీసీ ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే పద్ధతులను వివరించారు. హెచ్ఎండిఎస్ సెక్రెటరీ చంద్రయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రాముఖ్యతను వివరించారు. 

Tags:    

Similar News