Peddapalli: సింగరేణి బొగ్గు గనిలో చిక్కుకున్న ఇద్దరు మృతి
Peddapalli: ఇద్దరు మృతదేహాలను బయటకు తీసిన రెస్క్యూటీమ్
Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసుకురాగ ఇవాళ ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాలు సింగరేణి హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు. కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు. కోటి రుపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.