TTDP: చంద్రబాబు నివాసంలో ముగిసిన టీటీడీపీ నేతల సమావేశం
రేపు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది: నర్సిరెడ్డి
Hyderabad: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామ, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే పార్టీ కార్యచరణ రూపొందిస్తామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు. రేపు పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందని నర్సిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది స్పష్టం చేశారు.