తెలంగాణ విద్యుత్‌శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కేసు

Telangana: ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో దర్యాప్తు వేగవంతం

Update: 2022-07-26 05:09 GMT

తెలంగాణ విద్యుత్‌శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కేసు

Telangana: తెలంగాణ విద్యుత్‌శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. టాస్క్‌ఫోర్స్‌, ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యుత్‌శాఖ ఉద్యోగులే కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇప్పటికే ADE ఫిరోజ్‌ఖాన్‌, లైన్‌మెన్‌ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఒక్కొక్క ఉద్యోగానికి 5లక్షలు చొప్పున ఒప్పందం కుదుర్చుకోగా.. అడ్వాన్స్‌గా లక్ష వసూలు చేశారు నిందితులు. మైక్రోఫోన్‌తో అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌, రాచకొండలో కేసులు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులు, అభ్యర్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కీలక నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News