TSRTC: తెలంగాణ ఆర్టీసీ కీల‌క‌ నిర్ణయం..ఏపీకి వెళ్లే బ‌స్సులు రద్దు

TSRTC: ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను రద్దు చేసింది.

Update: 2021-05-06 01:24 GMT

TSRTC File photo

TSRTC: ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతుంది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించిన సంగ‌తి తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కర్ఫ్యూ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎవ‌రు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా క‌ట్ట‌దిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌జా రవాణ సైతం నిలిపివేస్తున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో అత్య‌వ‌స‌ర సేవారంగాల వారికి మిన‌హాయంపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ర‌కే బ‌స్సులు న‌డిపింది. తాజాగా ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను రద్దు చేసింది. ఏపీలో మధ్యా హ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొ న్నారు. బుధవారం కొన్ని సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి వెళ్లే అన్ని బస్సుల ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్నూలు, శ్రీశైలం, తదితర ప్రాంతాలవైపునకు వెళ్లే బస్‌ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఏపీలో కర్ఫ్యూకు 12 గంట‌ల‌కు ముందే బస్సులు అక్కడికి చేరుకోవాలి. మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాలి. ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదని ఆ అధికారులు వివరించారు. దీంతో ఏపీలో క‌ర్ఫ్యూ ఉన్నన్ని రోజులు బ‌స్సులు అన్ని పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు.

కర్ఫ్యూ విధించిన తొలి రోజు రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో వాహనాలు నిలిచిపోయాయి. తొలి రోజు కావ‌డంతో అధికారులు అనుమ‌తి ఇచ్చారు. ఇవాళ్టి నుంచి క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎలాంటి వాహ‌నాలు అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ఇతర రాష్ట్రల నుంచి ఏపీకి వ‌చ్చేవారు 12గంట‌లు దాటితే మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు నిరీక్షించ‌క తప్ప‌దు.

Tags:    

Similar News