TSPSC: సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్

TSPSC: కేసును ఛేదించిన పోలీసులు.. ఇంటిదొంగలే లీక్ చేశారని వెల్లడి

Update: 2023-03-14 03:23 GMT

TSPSC: సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్

TSPSC: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన టిఎస్‌పి‌ఎస్‌సీ పేపర్ లీకేజ్ ను చేదించారు టాస్క్ ఫోర్స్ ,సెంట్రల్ జోన్ పోలీసులు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు కనిపించాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హ్యాకింగ్ కాదని .. టి ఎస్ పిఎస్సీ లో పని చేసే ఉద్యోగులే యువతి మాయలో పడి పేపర్ లీకేజ్ కు పాల్పడ్డారని రుజువైంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. పేపర్‌ లీక్‌ ఎపిసోడ్ లో హ్యాకింగ్‌ జరగలేదని ఇంటి దొంగలే యువతి మాయలో పడి పేపర్ లీకేజ్ కు పాల్పడ్డారాన్ని నిర్ధారణ అయింది. హిందీ టీచర్ గా పనిచేస్తున్న రేణుక అనే యువతి తన భర్త డాక్య తో కలిసి పెద్ద స్కెచ్ వేసింది.TSPSC లో జరగబోతున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జాం తో పాటు, మార్చి 15,16 తేదీలలో జరిగే పశుసంవర్ధక శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల పేపర్ లను కాజేయలని ప్లాన్ వేసింది.

టి ఎస్ పిఎస్సీ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసే ప్రవీణ్ తో చనువుగా మాట్లాడి టీఎస్‌పీఎస్‌సీలో జరిగే ఎగ్జాం పేపర్లను లీక్ చేసి తనకు ఇవ్వాలని దీనికి 10 లక్షల రూపాయలు ఇస్తామని గాలం వేసింది. దీంతో ప్రవీణ్ ,టి ఎస్ పి ఎస్సీ లో నెట్వర్క్ అడ్మిన్ గా పనిచేసే రాజశేఖర్ తో కలిసి పేపర్ లీకేజ్ కు తెరతీశాడు, పేపర్లను మార్చి రెండున రేణుకకు అందించాడు. అదే రోజు రేణుక నుంచి అయిదు లక్షల రూపాయలు తీసుకున్నాడు. తరువాత ఆరవ తేదీన మరో అయిదు లక్షలు అందుకున్నాడు. ఈ డబ్బును, ప్రవీణ్, రాజశేఖ‌ర్ పంచకున్నారు.

రేణుక, ఆమె భర్త కలిసి ఈ పేపర్లను అమ్మకున్నారు. టీఎస్‌పీఎస్సీ సిస్టమ్ పాస్ వార్డ్ హాక్ అయిందని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో 12 జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జాం తో పాటు,15,16 తేదిల్లో జరగాల్సిన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ ఎగ్జాం లను వాయిదా వేశారు. మొత్తంగా ఈ పేపర్ లీకేజ్ స్కాంలో ప్రధాన సూత్రదారులు రేణుక,ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు పెన్ డ్రైవ్ లు, మూడు‌ల్యాప్ టాప్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News