Paper Leak: సీఎం కేసీఆర్‌తో TSPSC ఛైర్మన్‌ కీలక భేటీ

Paper Leak: పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న జనార్ధన్‌రెడ్డి

Update: 2023-03-18 05:56 GMT

Paper Leak: సీఎం కేసీఆర్‌తో TSPSC ఛైర్మన్‌ కీలక భేటీ

Paper Leak: TSPSC పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపింది. దీంతో ప్రగతిభవన్‌లో సీఎస్‌ శాంతికుమారి, TSPSC ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డితో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి వివరిస్తున్నారు. ఈ సమావేశంలో TSPSC మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సీఎంఓ అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.

అయితే కేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కేసీఆర్‌ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్‌పై హత్యానేరం కింద కేసు పెట్టాలని ఆరోపించారు. సిరిసిల్లలో నిరుద్యోగి నవీన్‌ ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. నవీన్‌ తండ్రి నాగభూషణంతో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌... నవీన్‌ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News